ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విదేశీ టూర్‌పై పొలిటికల్ ఫైట్!

కేంద్రం రాజకీయ కారణాలతో తన పర్యటనను అడ్డుకుంటోందన్న సీఎం రేవంత్ రెడ్డి... విద్య, క్రీడా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకే విదేశాలకు వెళ్లాలనుకున్నట్లు వెల్లడి... బ్రిటన్‌కు గ్రీన్‌సిగ్నల్.. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారని ఆరోపణ...

V10TV న్యూస్ డెస్క్ 24 ఆగస్టు, 2026 5:32 PMకి 2,126 వీక్షణలు
విదేశీ టూర్‌పై పొలిటికల్ ఫైట్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అంశం రాజకీయ విమర్శలకు దారితీసింది. తన విదేశీ పర్యటనపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం తన పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో విద్య, క్రీడా రంగాలకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో తాను విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రేవంత్ తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, ఆయా రంగాల్లో అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడమే తన పర్యటన ఉద్దేశమని స్పష్టం చేశారు.

విదేశీ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరగా బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి లభించిందని, అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించారని రేవంత్ పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టే పర్యటనను రాజకీయ కోణంలో చూడటం సరికాదని రేవంత్ అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086