బెంజ్ సర్కిల్ బస్టాప్‌లో వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ఆరా!
బస్టాప్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం... మృతుడి వయస్సు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా... ఆచూకీ కోసం ప్రజల సహకారం కోరిన మాచవరం పోలీసులు...

విజయవాడ, అక్టోబర్ 23: విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ బస్టాప్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి వయస్సు సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండవచ్చని మాచవరం హెడ్ కానిస్టేబుల్ శివరాం ప్రసాద్ తెలిపారు. మృతుడి పూర్తి వివరాలు, స్వస్థలం, కుటుంబ సభ్యుల సమాచారం ఇంకా తెలియరాలేదు. మృతుడి ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. మృతుడిని గుర్తుపట్టినవారు లేదా ఆయనకు సంబంధించిన సమాచారం తెలిసినవారు మాచవరం పోలీసులను సంప్రదించాలని కోరారు. అయితే వ్యక్తి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుడి గుర్తింపు, మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.

