ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ23, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

జనసేనకు సీట్ల కేటాయింపులో అన్యాయం!.. జనసైనికుడి ఆమరణ దీక్ష!

నందిగామలో జనసేనకు 20 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్... కేవలం రెండు సీట్లే ఇచ్చారంటూ జనసైనికుడు కాలేశ్వరరావు ఆవేదన... పరిటాల గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జనసేన కార్యకర్త...

V10TV న్యూస్ డెస్క్ 23 అక్టోబర్, 2026 1:53 PMకి 3,412 వీక్షణలు
జనసేనకు సీట్ల కేటాయింపులో అన్యాయం!.. జనసైనికుడి ఆమరణ దీక్ష! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

నందిగామ, అక్టోబర్ 23: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం కల్పించడం లేదంటూ ఆ పార్టీ కార్యకర్త ఆమరణ నిరాహార దీక్షకు దిగడం స్థానికంగా ఆసక్తి రేపుతోంది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన జనసైనికుడు పురమ కాలేశ్వరరావు శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేనకు కేటాయించిన సీట్ల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా కొనసాగుతున్న కాలేశ్వరరావు ప్రస్తుతం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 20 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం రెండు స్థానాలకే పరిమితం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలకు, నాయకులకు తగిన అవకాశాలు కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సీట్ల పంపకంలో జనసేన శ్రేణులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు కాలేశ్వరరావు తెలిపారు. ఈ దీక్షతో నందిగామ నియోజకవర్గంలో జనసేనకు సీట్ల కేటాయింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాలేశ్వరరావు డిమాండ్లపై జనసేన అధిష్ఠానం, కూటమి నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

జడ్పీటీసీ బరిలో కోటే సోమేశ్వరరావు!

2 గంటల క్రితం 3,296

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐ చేతికి!

3 గంటల క్రితం 3,358

రెబల్స్‌కు చెక్ పెట్టేనా?.. చంద్రబాబు–పవన్ కీలక భేటీ!

3 గంటల క్రితం 3,678

నామినేషన్ల వేళ హైటెన్షన్.. జోగి రమేష్ గృహ నిర్బంధం!

3 గంటల క్రితం 2,900