గుణదలలో కేబుల్ వైర్లపై దొంగల కన్ను!
కృష్ణా హోటల్, వంతెన సమీపంలో వైర్లు కత్తిరించిన గుర్తుతెలియని వ్యక్తులు… కేబుల్ ఆపరేటర్ ఫిర్యాదుతో కేసు నమోదు… ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు…

విజయవాడ, అక్టోబరు 5: గుణదలలోని కృష్ణా హోటల్, వంతెన సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను కత్తిరించి చోరీ చేశారు. గత నాలుగేళ్లుగా ఆ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మచిలీపట్నం నరసింహపేటకు చెందిన చిన వెంకన్న ఈ ఘటనపై సోమవారం గుణదల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

