ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సరస్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ చిన్ని

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎంపీ వెల్లడి… ఈ నెల 15 నుంచి 31 వరకు పున్నమి ఘాట్‌లో సరస్ మేళా… మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు…

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 1:53 PMకి 2,901 వీక్షణలు
సరస్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ చిన్ని — చిత్రం 1
సరస్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ చిన్ని — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 10: కృష్ణానది తీరంలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్ మేళా ఏర్పాట్లను శనివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పరిశీలించారు. సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎంపీ చిన్ని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ మేళాలో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది గుంటూరులో నిర్వహించిన సరస్ మేళా విజయవంతమైందని, అదే స్ఫూర్తితో విజయవాడలో మరింత విస్తృతంగా

సరస్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ చిన్ని — అదనపు చిత్రం 2

నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. డ్వాక్రా, మెప్మా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు తయారు చేసే హస్తకళా వస్తువులు,సంప్రదాయ ఉత్పత్తులు, గృహోపకరణాలకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే మేళా ప్రధాన లక్ష్యమన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086