86వ డివిజన్లో కాల్వల పూడికతీత పనులు
వర్షాలతో కాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు… కార్పొరేటర్ కాకొల్లు ఝాన్సీ చొరవతో పారిశుద్ధ్య చర్యలు… బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో పనులు చేపట్టిన సిబ్బంది…

పాయకాపురం, నవంబర్ 11 : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు విజయవాడ 86వ డివిజన్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు డివిజన్ కార్పొరేటర్ కాకొల్లు ఝాన్సీ, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కె. రవికుమార్ సంబంధిత అధికారులతో మాట్లాడి కాల్వల పూడికతీత పనులను చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని కాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. వర్షాల కారణంగా కాల్వల్లో పూడిక పేరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కాల్వల్లో పూడికను ఎప్పటికప్పుడు తొలగించి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి కాకొల్లు హర్షసాయి, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. బాబు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

