ఉగ్ర సంబంధాల కేసులో మహిళకు బెయిల్!
రాజమండ్రి ప్రత్యేక కారాగారం నుంచి సయిదా బేగం విడుదల… షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి బయటకు… మార్చిలో పది మంది అరెస్ట్.. ఇప్పటికే మరొకరికి బెయిల్…

విజయవాడ, నవంబర్ 11 : విజయవాడ ఉగ్రవాద సంబంధాల ఆరోపణల కేసులో అరెస్టయిన నిందితురాలు సయిదా బేగం బెయిల్‌పై విడుదలయ్యారు. మంగళవారం రాజమండ్రి ప్రత్యేక కారాగారం నుంచి ఆమె బయటకు వచ్చారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో జైలు అధికారులు ఆమెను విడుదల చేశారు. ఈ ఏడాది మార్చిలో ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. అనంతరం వారిని రాజమండ్రి జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మరో నిందితుడికి బెయిల్ లభించగా, తాజాగా సయిదా బేగం కూడా బెయిల్‌పై విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, నిందితులకు బెయిల్ మంజూరు కావడం కేసులోని ఆరోపణలపై తుది తీర్పు కాదని, న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగాల్సి ఉంటుందని న్యాయపరంగా గమనించాలి.

