ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం!
అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ... అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు... భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు...

విజయవాడ, అక్టోబర్ 13: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. మంగళవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో జగన్మాతను దర్శించుకుని భక్తులు పులకించిపోతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు, పోలీసు సిబ్బంది ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

