భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం
పాతబస్తీలో ఘనంగా గణనాథుడి శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పాతబస్తీలో వినాయక నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజారి వీధి, ఆంజనేయస్వామి వాగు, బ్రాహ్మణ వీధి, బావి పంపుల సెంటర్ ప్రాంతాల మీదుగా గణనాథుడి శోభాయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జిల్లా

వాణిజ్య విభాగం అధ్యక్షుడు పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, జిల్లా ఓబీసీ విభాగం అధ్యక్షుడు కందుల సుబ్రమణ్యం, అడ్డూరి భాస్కరరావు, చిన్న శ్రీరామ్‌తోపాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రజల విఘ్నాలను తొలగించి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సమృద్ధులు ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థించారు.

