ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సామాజిక మాధ్యమాలతో వ్యాపార విస్తరణ

మహిళలు ఆన్‌లైన్‌ వేదికలను వినియోగించుకోవాలి… పొదుపు సంఘాలు అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలి… సరస్‌ ఆజీవికా మేళాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు…

V10TV న్యూస్ డెస్క్ 16 అక్టోబర్, 2026 11:03 AMకి 2,989 వీక్షణలు
సామాజిక మాధ్యమాలతో వ్యాపార విస్తరణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 16: గ్రామీణ మహిళలు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని తమ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆన్‌లైన్‌ వేదికల ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ సరస్‌ ఆజీవికా మేళా–2026లో ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాల పాత్రను ప్రస్తావించారు. నిన్నటి పొదుపు సంఘాలు నేడు వ్యాపార సంస్థలుగా, రేపు అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు తయారుచేసే ఉత్పత్తులను మరింతమంది వినియోగదారులకు చేరువ చేసేందుకు సామాజిక మాధ్యమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు వ్యాపార రంగంలో ముందడుగు వేయాలని సూచించారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా చూస్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086