ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గుండె జబ్బులపై నిర్లక్ష్యం ప్రాణాంతకం

ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు... ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆయుష్‌ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం... నిరుపేదల జీవనోపాధికి ఇస్త్రీ, టిఫిన్‌ బండ్ల పంపిణీ...

V10TV న్యూస్ డెస్క్ 29 సెప్టెంబర్, 2026 5:35 PMకి 3,590 వీక్షణలు
గుండె జబ్బులపై నిర్లక్ష్యం ప్రాణాంతకం — చిత్రం 1
గుండె జబ్బులపై నిర్లక్ష్యం ప్రాణాంతకం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 29: గుండె సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సూచించారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కరెన్సీ నగర్‌లోని ఆయుష్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ పేదలకు గుండె, మెదడు సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. గుండె నుంచి రక్తప్రసరణ తీరు, మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో పూడికల పరిస్థితిని గుర్తించేందుకు కలర్‌ డాప్లర్‌, సీటీ స్కాన్‌, కాల్షియం స్కోర్‌, అల్ట్రాసౌండ్‌ పరీక్షలను యాభై శాతం రాయితీతో అందించడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అనంతరం డివిజన్‌లోని నిరుపేదలకు జీవనోపాధి కల్పించేందుకు కొర్ని చెల్లయ్యకు ఇస్త్రీ బండి, వీఎస్‌ఎస్‌ సత్యనారాయణకు టిఫిన్‌ బండిని ఎమ్మెల్యే అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు స్వయం ఉపాధితో నిలదొక్కుకునేందుకు ఇలాంటి సహాయం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. టీడీపీ నాయకుడు

గుండె జబ్బులపై నిర్లక్ష్యం ప్రాణాంతకం — అదనపు చిత్రం 2

గద్దె క్రాంతికుమార్‌ మాట్లాడుతూ చిన్న వయసులోనే గుండె జబ్బులకు గురవుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళనకరమన్నారు. చిన్నపాటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయాన్ని నివారించవచ్చని తెలిపారు. శిబిరంలో పరీక్షలతోపాటు అవసరమైన మందులను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. వైద్యుడు శ్రీనివాస్‌ చౌదరి మాట్లాడుతూ పొగాకు వినియోగం, మితిమీరిన మద్యపానం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని వివరించారు. కలర్‌ డాప్లర్‌, కాల్షియం స్కోర్‌ తదితర పరీక్షలు గుండెపోటు, మెదడు పక్షవాతం ముప్పును ముందుగానే అంచనా వేసేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ముప్పై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు వై.రమేష్‌బాబు, పి.శ్రీనివాస్‌ చౌదరి, ఎం.జయలక్ష్మి, నాయకులు గద్దె రమేష్‌, తుమాటి ప్రేమ్‌నాథ్‌, పేరేపి ఈశ్వర్‌, యలమంచిలి పండు, యలమందలరావు, తాడి బాబూరావు, బండి సాయి కోమలి, గద్దె శ్రీనివాస్‌, గొల్లపల్లి శంకర్‌, దాడి సుబ్బారావు, ప్రకాష్‌బాబు, గుంజా యేసు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086