రేప్ చేస్తే చంపేస్తారనే భయం పుట్టాలి: సుప్రీంకోర్టు
మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు… రేప్ చేయాలనే ఆలోచన రాకుండా పురుషుల్లో భయం కలిగించాలి… రాష్ట్రాలు మహిళలు నిర్భయంగా రోడ్లపై నడిచే పరిస్థితి కల్పించాలి: సుప్రీంకోర్టు…

ఢిల్లీ: మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రేప్‌కు పాల్పడితే చంపేస్తారనే స్థాయిలో పురుషుల్లో భయం ఏర్పడాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని స్లీపర్ బస్సులో మైనర్‌పై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. లైంగిక నేరాలకు పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయనే భయం నేరస్తుల్లో కలిగేలా చర్యలు ఉండాలని పేర్కొంది. మహిళలు రాత్రివేళల్లోనూ నిర్భయంగా రోడ్లపై నడిచే సురక్షిత పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావుండకూడదని సూచించింది.

