ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

బెజవాడ రైల్వేస్టేషన్‌లో రూ.11 లక్షల ఎండీఎంఏ పట్టివేత!

ఈగల్‌, జీఆర్పీ సంయుక్త తనిఖీల్లో 110 గ్రాముల మాదకద్రవ్యం స్వాధీనం… బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చిన 21 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్‌… ప్రియుడి బెయిల్‌ కోసం డబ్బు సమకూర్చేందుకే డ్రగ్స్‌ రవాణా చేసినట్లు పోలీసుల వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 14 అక్టోబర్, 2026 8:56 PMకి 4,653 వీక్షణలు
బెజవాడ రైల్వేస్టేషన్‌లో రూ.11 లక్షల ఎండీఎంఏ పట్టివేత! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 15: విజయవాడ రైల్వేస్టేషన్‌లో భారీ మొత్తంలో మాదకద్రవ్యం పట్టుబడటం కలకలం రేపింది. ఈగల్‌, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.11 లక్షల విలువైన 110 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైలులో ఉన్న ప్రియుడిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికే మాదకద్రవ్యాలను తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఆరో నంబర్‌ ప్లాట్‌ఫారంపై మొదటి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మెట్ల సమీపంలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న యువతిని తనిఖీ సిబ్బంది గుర్తించారు. పోలీసులను చూసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించడంతో మహిళా ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బ్యాగును తనిఖీ చేయగా రెండు చిన్న ప్యాకెట్లలో 110 గ్రాముల మాదకద్రవ్యం లభించింది. ప్రాథమిక పరీక్షల్లో అది ఎండీఎంఏగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటమట ప్రాంతానికి చెందిన ఎర్రంశెట్టి నాగసామ్య (21) ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతోంది. ఆమెకు పరిచయమైన యువకుడు గతంలో ఎండీఎంఏ సంబంధిత కేసులో అరెస్టయి చిత్తూరు జైలులో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అతడిని బెయిల్‌పై విడుదల చేయించేందుకు డబ్బు అవసరమవడంతో స్నేహితుడి నుంచి సుమారు రూ.లక్ష తీసుకుని బెంగళూరుకు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్కడ మాదకద్రవ్యాన్ని సేకరించి రైలులో విజయవాడకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అక్టోబర్‌ 14న రాత్రి సుమారు 11.45 గంటలకు రైలు విజయవాడకు చేరుకున్న సమయంలో నిర్వహించిన తనిఖీల్లో ఆమె పట్టుబడినట్లు అధికారులు వివరించారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యం విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. డ్రగ్స్‌ సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు ఈ ఘటనకు సంబంధించి విజయవాడ జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 254/2026 కింద ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్లు 8(సి), 22(సి) ప్రకారం కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాన్ని జప్తు చేసి నిందితురాలిని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. బెంగళూరులో డ్రగ్స్‌ ఎవరి నుంచి కొనుగోలు చేసింది? విజయవాడలో ఎవరికి సరఫరా చేయాలనుకుంది? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీఆర్పీ డీఎస్పీ జైసూర్య, ఈగల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. రవీంద్ర, జీఆర్పీ సీఐ వెంకటరమణ, ఎస్సై షరీఫ్‌, ఈగల్‌ మహిళా ఎస్సై ఎస్‌. దుర్గాభవాని పర్యవేక్షణలో సంయుక్త తనిఖీలు నిర్వహించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086