ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

మహిళ ఖాతా ఖాళీ.. సైబర్ కేటుగాళ్ల చేతికి రూ.1.98 లక్షలు!

• విజయవాడ దేవీనగర్‌కు చెందిన మహిళకు సైబర్ షాక్... • తెలియకుండానే గూగుల్ పే ద్వారా రూ.1.98 లక్షలు బదిలీ... • రెండు రోజుల వ్యవధిలో వరుస లావాదేవీలు...

V10TV న్యూస్ డెస్క్ 29 ఆగస్టు, 2026 5:32 PMకి 1,698 వీక్షణలు
మహిళ ఖాతా ఖాళీ.. సైబర్ కేటుగాళ్ల చేతికి రూ.1.98 లక్షలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ క్రైమ్, ఆగస్టు 29: విజయవాడ దేవీనగర్‌కు చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండానే రూ.1.98 లక్షలు గూగుల్ పే ద్వారా బదిలీ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు ఇటీవల తన బ్యాంకుకు వెళ్లి ఖాతాను పరిశీలించగా నగదు బదిలీ అయిన విషయం గుర్తించినట్లు సమాచారం. ఆగస్టు 23న రూ.98 వేలు, 24న రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.98 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు.

తనకు తెలియకుండా నగదు బదిలీ జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, డబ్బు ఏ ఖాతాకు వెళ్లింది? లావాదేవీలు ఎలా జరిగాయి? ఖాతాకు సంబంధించిన వివరాలు ఎలా బయటకు వెళ్లాయి? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

చిరువ్యాపారుల పొట్టకొట్టొద్దు.. ప్రత్యామ్నాయం చూపించాలి

52 నిమిషాల క్రితం 4,216

వైసీపీలో మతమార్పిడుల ఒత్తిడి ఉండేది: చంద్రబాబు ఆరోపణ

2 గంటల క్రితం 1,569

ముందస్తు పరీక్షలే రక్షణ.. విద్యార్థులకు అవగాహన

2 గంటల క్రితం 1,919

జంక్ ఫుడ్‌కు రెడ్ అలర్ట్!

2 గంటల క్రితం 2,257