పట్టాల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె
తూర్పు నియోజకవర్గం నుంచి భారీగా హాజరైన లబ్ధిదారులు... పేదలకు ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పించామని వెల్లడి... పేదల సంతోషమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 30: పేద ప్రజల ఆనందమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో బుధవారం నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు సంపూర్ణ హక్కులతో పట్టాలు అందించేందుకు స్టేడియంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పట్టాల పంపిణీ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. తూర్పు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో లబ్ధిదారులు

కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల నివాస స్థలాలకు పట్టాలు మంజూరు చేసే అంశాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 25 వేల కుటుంబాలకు ఆస్తిపై శాశ్వత హక్కులు కల్పించినట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని అనేకమంది పేదలకు వారి పేరుతో ఆస్తి హక్కు లభించడం సంతోషకరమన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని చెప్పారు. పేదలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు.

