సిడ్నీలో మేయర్‌గా తెలంగాణ మహిళ
స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్‌గా సంధ్యారెడ్డి… డిప్యూటీ మేయర్ నుంచి 73వ మేయర్‌గా బాధ్యతలు… 2028 సెప్టెంబరు వరకు పదవిలో కొనసాగనున్న తెలంగాణ బిడ్డ…

హైదరాబాద్, అక్టోబర్ 1 : ఆస్ట్రేలియాలోని సిడ్నీ పరిధిలో ఉన్న స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్‌గా తెలంగాణకు చెందిన కర్రి సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. శాండీ రెడ్డిగా గుర్తింపు పొందిన ఆమె ఇప్పటివరకు డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. తాజాగా స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ 73వ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2028 సెప్టెంబరు వరకు ఆమె పదవిలో కొనసాగనున్నారు. స్థానిక ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గౌరవంతోపాటు గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు సంధ్యారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన ఆమె 1991లో ఆస్ట్రేలియాకు వెళ్లి ఇమిగ్రేషన్ న్యాయవాదిగా స్థిరపడ్డారు.

