ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులకు విజయవాడ ఉత్సవ్ ఆహ్వానం
ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్య, విభాగ్ ప్రచారక్ నవీన్‌లతో ఎంపీ కేశినేని చిన్ని భేటీ… విజయవాడ ఉత్సవ్ సీజన్–2కు హాజరుకావాలని ఆహ్వానం…

విజయవాడ, అక్టోబర్ 10: విజయవాడ ఉత్సవ్ సీజన్–2 కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రముఖులను విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆహ్వానించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యాలయం హైందవిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్య, విభాగ్ ప్రచారక్ నవీన్‌లను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ సీజన్–2 కార్యక్రమానికి హాజరుకావాలని వారిని ఆహ్వానించారు.

