ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

స్థానిక సమరానికి భద్రతా కవచం

పోలింగ్‌ కేంద్రాల పరిశీలనతో ముందస్తు భద్రతా ప్రణాళిక… సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా… ఏలూరు రేంజ్‌ పోలీసు అధికారులతో డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా సమీక్ష…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 9:46 AMకి 3,148 వీక్షణలు
స్థానిక సమరానికి భద్రతా కవచం — చిత్రం 1
స్థానిక సమరానికి భద్రతా కవచం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

తూర్పుగోదావరి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా పోలీసు అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏలూరు రేంజ్‌ పరిధిలోని జిల్లా ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికలకు సంబంధించిన కేసులు, సమస్యాత్మక ప్రాంతాలపై చర్చించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలు, అవి ఉన్న ప్రదేశాలను ముందుగానే పరిశీలించి సమగ్ర భద్రతా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించాలని ఆదేశించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సబ్‌

స్థానిక సమరానికి భద్రతా కవచం — అదనపు చిత్రం 2

డివిజనల్‌ పోలీసు అధికారులు, బదిలీపై వచ్చిన అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేసి సున్నితమైన అంశాలపై ముందస్తు సమాచారం సేకరించాలని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై చట్ట నిబంధనల ప్రకారం బైండోవర్‌ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది, బందోబస్తు, సంచార గస్తీ బృందాల ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి జాతీయ కేడెట్‌ దళం, జాతీయ సేవా పథకం వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా, సురక్షితంగా, పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086