ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

టీడీపీలోకి ముస్లిం మైనారిటీల చేరికలు

మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట... బొండా ఉమా సమక్షంలో పార్టీలో చేరిన పలువురు ముస్లిం మైనారిటీలు... సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీకి ఆదరణ పెరుగుతోందన్న ఎమ్మెల్యే...

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 9:26 AMకి 2,878 వీక్షణలు
టీడీపీలోకి ముస్లిం మైనారిటీల చేరికలు — చిత్రం 1
టీడీపీలోకి ముస్లిం మైనారిటీల చేరికలు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 9: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలువురు ముస్లిం మైనారిటీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం బీఆర్‌టీఎస్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన కంచి ధనశేఖర్, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు షేక్ గౌస్ బాషా ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మైనారిటీ కుటుంబాల అభ్యున్నతి, పిల్లల విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం

టీడీపీలోకి ముస్లిం మైనారిటీల చేరికలు — అదనపు చిత్రం 2

అందించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో షేక్ బాజీ, లతీఫ్, అబ్దుల్ వహీద్, ఇబ్రహీం ఖాన్, అమీర్ జానీ, షేక్ ఏజాద్, పఠాన్ రెహమాన్, షేక్ మస్తాన్ వలి, షేక్ సుభాని, షేక్ సలాం, షేక్ ఆఫీసుల్లా, షేక్ షరీఫ్, షేక్ కాసిం, బాజీ, అమీర్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో షేక్ బాజీ, లతీఫ్, అబ్దుల్ వహీద్, ఇబ్రహీం ఖాన్, అమీర్ జానీ, షేక్ ఏజాద్, పఠాన్ రెహమాన్, షేక్ మస్తాన్ వలి, షేక్ సుభాని, షేక్ సలాం, షేక్ ఆఫీసుల్లా, షేక్ షరీఫ్, షేక్ కాసిం, బాజీ, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086