NTA డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్ అధికారి విపన్న వెంకటేష్
సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్లపాటు నియామకం... DoPT ఉత్తర్వులు జారీ.. కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యత... గతంలో ఏలూరు కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా సేవలు...

విజయవాడ, ఆగస్టు 28: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అధికారి విపన్న వెంకటేష్ నియమితులయ్యారు. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు సమాచారం.
ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) ఉత్తర్వులు జారీ చేసింది. 2012 బ్యాచ్‌కు చెందిన వెంకటేష్ గతంలో ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు.
పరిపాలనలో తనదైన ముద్ర వేసిన ఆయనకు కేంద్ర స్థాయిలో కీలక బాధ్యత లభించడం పట్ల పలువురు అధికారులు, సన్నిహితులు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇటీవల సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లక్ష్యాల సాధనకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయన ప్రతిష్ఠాత్మక అవార్డును కూడా అందుకున్నారు. విద్యారంగంలో అత్యంత కీలకమైన పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టే NTAలో డైరెక్టర్‌గా ఆయన నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

