ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

‘చలో లోక్‌భవన్‌’కు ముందస్తు నిర్బంధాలు!

విజయవాడలో సీపీఎం నేతల ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు... శ్రీనివాస్‌ గృహనిర్బంధం.. అర్ధరాత్రి బాబూరావు ఇంటికి పోలీసులు... శాంతియుత నిరసనలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని బాబూరావు విమర్శ...

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 9:56 AMకి 3,140 వీక్షణలు
‘చలో లోక్‌భవన్‌’కు ముందస్తు నిర్బంధాలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 10: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం విజయవాడలో తలపెట్టిన ‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు నిర్బంధ చర్యలు చేపట్టారు. సీపీఎం నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించడంతో పాటు పలువురిని గృహనిర్బంధం చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు తెలిపారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పోలీసులు తన ఇంటికి వచ్చారని వెల్లడించారు. పాయకాపురం శాంతినగర్‌లో సీపీఎం నేత సీహెచ్‌ శ్రీనివాస్‌ను గృహనిర్బంధం చేసి ఇంటి వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారని పేర్కొన్నారు. మరో నేత బోయి సత్యబాబు ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారని తెలిపారు. నగరంలోని పలువురు నాయకులకు ఫోన్లు చేసి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నట్లు ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అధికారంలోకివచ్చిన కూటమి ప్రభుత్వం శాంతియుత ఆందోళనలను నిర్బంధాలతో అడ్డుకోవడం శోచనీయమని బాబూరావు విమర్శించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా తెలుగుదేశం, జనసేన పార్టీలు స్పందించకపోవడం గర్హనీయమన్నారు. మరోవైపు నగరంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉండటం, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌, సరస్‌ మేళా నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిరసనలకు అనుమతి నిరాకరించినట్లు పోలీస్‌ కమిషనరేట్‌ ప్రకటించింది. అనుమతులు లేకుండా నిరసనలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086