వైసీపీ నుంచి టీడీపీలోకి 25 మంది చేరిక
బొండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరిన దుప్పట్ల రాము బృందం… కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరిక… సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్న ఎమ్మెల్యే బొండా ఉమా…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 9: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన దుప్పట్ల రాము తన 25 మంది అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో 30వ డివిజన్ మధ్యకట్ట ప్రాంతానికి చెందిన వీరు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక

సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, అర్హులకు సంక్షేమ పథకాల అందజేతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన దుప్పట్ల రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే బొండా ఉమా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో 30వ డివిజన్ క్లస్టర్ ఇన్‌చార్జి ఘంటా కృష్ణమోహన్, చింతపల్లి కనకారావు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

