గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్
బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి జగన్... ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు... గన్నవరం నుంచి తాడేపల్లికి బయలుదేరిన మాజీ సీఎం...

గన్నవరం, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, దేవభక్తుని చక్రవర్తి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జగన్మోహన్రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు.

