ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ9, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

వైద్య చికిత్సకు రూ.6.40 లక్షల ఆర్థిక భరోసా!

ఇద్దరు బాధితులకు ఎల్‌ఓసీలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి… భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో పత్రాల అందజేత… సకాలంలో వైద్య సాయంపై బాధిత కుటుంబాల హర్షం…

V10TV న్యూస్ డెస్క్ 9 నవంబర్, 2026 4:37 PMకి 6,114 వీక్షణలు
వైద్య చికిత్సకు రూ.6.40 లక్షల ఆర్థిక భరోసా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 9 : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ప్రభుత్వం రూ.6.40 లక్షల విలువైన రెండు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ)లను మంజూరు చేసింది. సోమవారం భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి బాధిత కుటుంబాలకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. 45వ డివిజన్ కొత్తపేటకు చెందిన బి.హర్షిత (16) అండాశయ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె చికిత్స నిమిత్తం ప్రభుత్వం రూ.3.95 లక్షల విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేసింది. అదేవిధంగా 56వ డివిజన్‌కు చెందిన పర్వీన్ (48) చెవి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ వైద్య సహాయం కోరగా రూ.2.45 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. వైద్య సహాయం కోసం చేసిన విజ్ఞప్తులపై ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి ప్రభుత్వం నుంచి ఎల్‌ఓసీలు మంజూరు చేయించడంపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు దేవిన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

గుడివాడలో కూటమి జోరు.. మూడు జడ్పీటీసీలు క్లీన్‌స్వీప్!

19 నిమిషాల క్రితం 6,987

51వ డివిజన్‌లో గంజాయి బ్యాచ్‌ల కలకలం!

1 గంట క్రితం 7,565

ప్రజల మధ్యకు గద్దె.. సమస్యల పరిష్కారానికి భరోసా!

1 గంట క్రితం 7,227

నగరాభివృద్ధిలో నూతన కార్పొరేటర్లు కీలక పాత్ర పోషించాలి

1 గంట క్రితం 6,875