ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కూటమి సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలి కొత్త వార్డుల సరిహద్దులపై క్యాడర్‌ అవగాహన పెంచుకోవాలి తూర్పు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె దిశానిర్దేశం

V10TV న్యూస్ డెస్క్ 23 సెప్టెంబర్, 2026 5:48 PMకి 2,361 వీక్షణలు
ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి — చిత్రం 1
ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ బ్యూరో, సెప్టెంబర్‌ 23 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం గద్దె రామమోహన్‌ అధ్యక్షతన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాలను సాధించేలా సమష్టిగా కృషి చేయాలన్నారు. నగరపాలక సంస్థ వార్డుల సంఖ్య 86కు పెరిగిందని, ఓటర్ల జాబితాలు కూడా విడుదలయ్యాయని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో గతంలో 21 వార్డులు ఉండగా, పునర్విభజన అనంతరం వాటి సంఖ్య 29కి పెరిగిందన్నారు. మారిన వార్డుల సరిహద్దులను నాయకులు పరిశీలించి, కొత్త ప్రాంతాల్లోని ప్రజలతో పరిచయాలు పెంచుకోవాలని సూచించారు. గత రెండేళ్లలో నగరపాలక సంస్థ పరిధిలో కోట్లాది రూపాయలతో రహదారులు, కల్వర్టులు, తాగునీరు,

ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి — అదనపు చిత్రం 2

విద్యుత్‌ తదితర అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. స్వయం ఉపాధి పొందేందుకు పలువురికి పార్టీ తరఫున సహకారం అందించామన్నారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించి కూటమి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన గద్దె రామమోహన్‌ ఉపాధ్యాయులపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడటం గర్హనీయమన్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి లోపాలకు తావులేకుండా డీఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించిందని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులను డీఎస్సీల ద్వారా నియమించడంతోపాటు బదిలీల్లో పారదర్శకత కోసం కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులపై దౌర్జన్యం చేయడం సరికాదని, వైసీపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ముమ్మనేని ప్రసాద్‌, చెన్నుపాటి గాంధీ, గాబ్రియేల్‌, రత్నశ్రీ, దయాల శిరీష గాంధీ, గద్దె రమేష్‌, తాడి బాబూరావు, గల్లా రవి, అజయ్‌కుమార్‌, పడాల గంగాధర్‌, సతీష్‌చంద్ర, కొత్తపల్లి రమేష్‌, కర్ణా రమేష్‌, శింగంశెట్టి రమేష్‌, రాయి రంగమ్మ, బాగం సాయి, పులమోలు లక్ష్మి, కొర్రా అప్పన్న, గొరిపర్తి నామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086