ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
బుద్ధా వెంకన్న ఆదేశాలతో ప్రజా దర్బార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన టీడీపీ నాయకులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 4 (ఆంధ్రప్రభ): పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలనే లక్ష్యంతో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్ధా వెంకన్న ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చందన సురేష్ (మావ), సురభి బాలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతోపాటు స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చందన సురేష్, సురభి బాలు మాట్లాడుతూ బుద్ధా

వెంకన్న ఆధ్వర్యంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే బుద్ధా వెంకన్న లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అమర మురళి, గోలి శ్రీను, పి.బోసుబాబు, పితాని పద్మ, కామోజి కామాక్షి, మట్టి శ్రీలక్ష్మి, యర్రంశెట్టి పద్మ, పి.దుర్గ, బి.రోహిణీప్రియ, శంబంగి చలం తదితరులు పాల్గొన్నారు.

