ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం

విద్యార్థుల సౌకర్యార్థం 40 మంచాల అందజేత... జుజ్జూరు, అల్లూరులో రూ.1.40 కోట్లతో సీసీ రోడ్లు... 276 మందికి రూ.1.37 కోట్ల సీఎం సహాయనిధి...

V10TV న్యూస్ డెస్క్ 30 సెప్టెంబర్, 2026 8:50 AMకి 3,967 వీక్షణలు
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

నందిగామ, సెప్టెంబర్ 30: నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. మంగళవారం నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యార్థం దాతల సహకారంతో సమకూర్చిన 40 మంచాలను అందజేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు. విద్యార్థులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పల్లె పండుగ 3.0లో భాగంగా జుజ్జూరు గ్రామంలో రూ.80 లక్షలు, అల్లూరు ఎస్సీ కాలనీలో రూ.60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాలు, పేదల కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తోందని సౌమ్య పేర్కొన్నారు. వీరులపాడు మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.25.51 లక్షల విలువైన సహాయనిధి చెక్కులను అందజేశారు. నందిగామ నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటివరకు 276 మందికి రూ.1,37,11,559 ఆర్థిక సహాయం మంజూరైనట్లు వెల్లడించారు. ఫోటో రైట్‌అప్: నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086