ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలో ప్రశ్నిస్తున్న ఉమెన్ సేఫ్టీ అధికారులు
లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు... డీసీపీ రాష్మి నాయక్ పర్యవేక్షణలో కొనసాగుతున్న విచారణ... కీలక వివరాలు రాబట్టే దిశగా కస్టడీలో ముమ్మర ప్రశ్నలు...

విజయవాడ, ఆగస్టు 6 (వి10టీవీ): మెహిదీపట్నం ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన లైంగిక వేధింపుల కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా ఆయనను కస్టడీలోకి తీసుకున్న ఉమెన్ సేఫ్టీ విభాగం అధికారులు విస్తృతంగా ప్రశ్నిస్తున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై డీసీపీ రాష్మి నాయక్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుండగా, కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అధికారులు సేకరిస్తున్న ఆధారాలు, వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు...

