బెట్టింగ్ వ్యసనం.. చోరీల బాట!
అయోధ్యనగర్‌లో ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, బంగారు ఉంగరాల చోరీ… 24 గంటల్లో కేసును ఛేదించిన అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు… సీసీఎస్ సహకారంతో నిందితుడి అరెస్ట్…

విజయవాడ, నవంబర్ 12: బెట్టింగ్ వ్యసనానికి అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న ఓ యువకుడిని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అయోధ్యనగర్‌లోని ఓ ఇంట్లో తాళాలు పగలగొట్టి నగదు, రెండు బంగారు ఉంగరాలు అపహరించిన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) బృందం సహకారంతో నిందితుడి ఆచూకీ గుర్తించి న్యూ ఆర్టీసీ పేటలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మహారాష్ట్రకు చెందిన రెడ్డిపల్లి అజిత్ (27)గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడిన నిందితుడు డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారంతో దర్యాప్తు చేపట్టి స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఈ ఘటనతో బెట్టింగ్ వ్యసనం యువతను నేరాల వైపు నడిపిస్తున్న తీరుపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

