హైస్కూల్ రోడ్డులో ప్రత్యేక డ్రైవ్!
రోడ్డుపై తోపుడు బండ్లు, వీధి వ్యాపారుల క్రమబద్ధీకరణకు చర్యలు… తోపుడు బండ్లను రహదారికి దూరంగా జరిపించిన సిబ్బంది… సీహెచ్-9 అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు…

విజయవాడ, నవంబర్ 12 : హైస్కూల్ రోడ్డులో గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రహదారిపై ఉన్న తోపుడు బండ్లు, వీధి వ్యాపారులను వెనక్కి జరిపించే చర్యలు చేపట్టారు. రహదారిపై రాకపోకలకు ఆటంకం కలగకుండా వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించారు. సీహెచ్-9 అధికారితో పాటు సంబంధిత సిబ్బంది ఈ డ్రైవ్లో పాల్గొన్నారు.

