ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ విజయమే లక్ష్యం: బొండా ఉమా

హామీల అమలుతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం… సంక్షేమం, అభివృద్ధికి అండగా నిలవాలని పిలుపు… 63వ డివిజన్‌ అరండల్‌పేటలో ఇంటింటి ప్రచారం…

V10TV న్యూస్ డెస్క్ 15 అక్టోబర్, 2026 6:46 PMకి 3,847 వీక్షణలు
స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ విజయమే లక్ష్యం: బొండా ఉమా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 15: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల సంపూర్ణ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ప్రభుత్వ విప్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 63వ డివిజన్‌ అరండల్‌పేట ఉర్దూ హైస్కూల్‌ వద్ద నుంచి నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని ఉమా తెలిపారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచి ఆర్థిక భరోసా కల్పించామన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పింఛన్లు అందించడం ద్వారా పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాలతో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.ఐదుకే భోజనం అందిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రచారంలో ప్రజలు ఆత్మీయంగా స్వాగతిస్తున్నారని, ప్రభుత్వంపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని ఉమా అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువత ఉపాధి, పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీలో చేరగా, వారికి ఉమా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు మాచర్ల గోపి, మాచర్ల పావని, సుబ్బారావు, ఇనుకుల సాయిబాబు, దొంగర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086