రూ.500 నుంచి రూ.5 వేల వరకు.. విశాఖలో నీటి ధరల షాక్
– ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతో భారం మోస్తున్న ప్రజలు.. – అవసరాన్ని బట్టి పెరుగుతున్న నీటి ధరలు.. – జీవీఎంసీ సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు..

విశాఖపట్నంలో తాగునీటి కొరతతో ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై ప్రజలు ఆధారపడుతున్నారు. దీంతో ట్యాంకర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రూ.500 ఉన్న ఒక కిలోలీటర్ (1 KL) ట్యాంకర్ ధర ప్రస్తుతం రూ.800–1,000 వరకు పెరిగింది. అలాగే 2 కిలోలీటర్ల ట్యాంకర్‌కు రూ.1,500–2,000 వరకు వసూలు చేస్తున్నారు. 6 కిలోలీటర్ల ట్యాంకర్ ధర ఏకంగా రూ.5 వేల వరకు పలుకుతోంది. జీవీఎంసీ పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపర్చాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
