ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఆపదలో పేదలకు ఆర్థిక భరోసా!

9 మంది లబ్ధిదారులకు రూ.5.89 లక్షల సీఎంఆర్ఎఫ్‌ చెక్కులు... వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ సాయం... పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.. ఎమ్మెల్యే బొండా ఉమా...

V10TV న్యూస్ డెస్క్ 13 అక్టోబర్, 2026 4:24 PMకి 3,573 వీక్షణలు
ఆపదలో పేదలకు ఆర్థిక భరోసా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 13: అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 58వ డివిజన్‌కు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ.5.89 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలైనప్పుడు వైద్య ఖర్చులు పెనుభారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఊరటనిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య ఖర్చుల కారణంగా పేద కుటుంబాలు అప్పుల పాలుకాకుండా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్‌, మాజీ కార్పొరేటర్లు పిరియ జగదాంబ, ఎరుబోతు శ్రావణి, డివిజన్‌ అధ్యక్షుడు కూర్మాపు దుర్గారావు, ఇన్‌చార్జి పిరియ సోమేశ్వరరావు, క్లస్టర్‌ ఇన్‌చార్జి అలా తారక రామారావు, అమర్నాథ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086