ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

వేగవరంలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తత

పాత ప్రదేశంలో పునఃప్రతిష్ఠకు కొందరు స్థానికుల అభ్యంతరం రహదారి విస్తరణ సమయంలో గతంలో తొలగించిన విగ్రహం ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 11:23 AMకి 2,566 వీక్షణలు
వేగవరంలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తత — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

వేగవరం, సెప్టెంబరు 26: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ పునఃప్రతిష్ఠ వివాదాస్పదంగా మారింది. గతంలో విగ్రహం ఉన్న ప్రదేశంలోనే తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రహదారి విస్తరణ పనులకు అడ్డుగా ఉందన్న కారణంతో గతంలో స్థానికులతో చర్చించి విగ్రహాన్ని తొలగించారు. తాజాగా అదే ప్రాంతంలో పునఃప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేపట్టగా, విగ్రహం ఏర్పాటు చేసే స్థలంపై కొందరు అభ్యంతరం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారానికి సంబంధిత వర్గాలతో అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086