ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కండ్రికలో బొండా సిద్ధార్థ ఇంటింటి ప్రచారం

కూటమి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వివరణ… స్థానిక సమస్యలపై ప్రజలతో ముఖాముఖి… సెంట్రల్‌లోని 29 డివిజన్లలో కూటమి బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 15 అక్టోబర్, 2026 7:39 PMకి 4,870 వీక్షణలు
కండ్రికలో బొండా సిద్ధార్థ ఇంటింటి ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 15: ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నామని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ తెలిపారు. గురువారం సాయంత్రం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని 86వ డివిజన్‌ కండ్రిక రామాలయం వద్ద నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులను కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో సెంట్రల్‌ నియోజకవర్గంలోని 29 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ, కూటమి బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ హామీల అమలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హులకు అందుతున్న ప్రయోజనాలను ఇంటింటికీ వివరిస్తున్నామని చెప్పారు. స్థానిక సమస్యలను సంబంధిత నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం ప్రచార కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాకొల్లు వరలక్ష్మి, కాకొల్లు సాయి హర్ష, కాకొల్లు ఝాన్సీ, కాకొల్లు సాయి చరణ్‌, ఎస్‌.కె. బాబు, కోమారి రాజేష్‌, కోరాడ రమణ, బాబు, తిరుపతయ్య, రమణ, సూర్యనారాయణ, ఖాజా, రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086