అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
80వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల నృత్యాలు ‘జైహో అమరావతి’ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేసిన విద్యార్థినులు ‘పవర్ ఆఫ్ రిథమ్’ పేరుతో ఆకట్టుకున్న బాస్కెట్బాల్ విన్యాసాలు

ఆగస్టు 15 – V10TV AP: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సత్యనారాయణపేట ఏకేటీపీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థినులు ‘జైహో అమరావతి’ పాటకు ఉత్సాహంగా నృత్యం చేసి మెప్పించారు. జగయ్యపేట విద్యార్థులు ‘పవర్ ఆఫ్ రిథమ్’ పేరుతో బాస్కెట్బాల్ విన్యాసాలు, వివిధ నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాలను ప్రజలు, అధికారులు ఆసక్తిగా తిలకించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

