ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయి: వైఎస్ జగన్

దాడులు, బెదిరింపులు ఎదురైనా వైసీపీ నేతలు ధైర్యంగా నిలబడ్డారు... ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే ఖూనీ చేస్తున్నారని విమర్శ... పోటీ లేకుండా గెలవడమే విజయమా అంటూ అధికార పక్షాన్ని ప్రశ్నించిన జగన్...

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 2:44 PMకి 3,673 వీక్షణలు
స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయి: వైఎస్ జగన్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, అక్టోబర్ 27 : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దౌర్జన్యాలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక కష్టాలు, దాడులు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే దానిని ఖూనీ చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ కేంద్రాలను ఆక్రమించుకోవడం వంటి ఘటనలు దేశంలో మరెక్కడా కనిపించవని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా నామినేషన్ వేసే అవకాశం ఉండాలని, ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకునే పరిస్థితులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకుని, పోటీ లేకుండా గెలిచి తామే విజయం సాధించామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల మద్దతుపై నమ్మకం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎందుకు భయపడుతున్నారని అధికార పక్షాన్ని జగన్ నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని కష్టాలు, ఒత్తిళ్లు ఎదురైనా వైసీపీ నాయకులు ధైర్యంగా నిలబడటం అభినందనీయమని పేర్కొన్నారు. ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకు నామినేషన్ల సమయంలో తమ అభ్యర్థులను అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, ఫిర్యాదులను, వాటికి సంబంధించిన ఆధారాలను పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కూడా సూచించింది. అయితే ఆరోపణలన్నీ రుజువైనట్లు కాదని, వాటిని విడివిడిగా పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

'అర్నబ్' తుపాను వేళ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ లక్ష్మీశ

37 నిమిషాల క్రితం 4,898

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ

42 నిమిషాల క్రితం 3,680

'అర్నబ్' తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు!

1 గంట క్రితం 4,556

కూటమి అభివృద్ధిని.. ప్రతిపక్ష రాజకీయాలను ప్రజలు గుర్తించాలి!

1 గంట క్రితం 4,856