ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

'అర్నబ్' తుపాను వేళ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ లక్ష్మీశ

పెనుగాలులు వీచే అవకాశం.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు... అధికారుల సూచనల మేరకు తుపాను రక్షణ కేంద్రాలకు వెళ్లాలి... సామాజిక మాధ్యమాల్లో వదంతులు నమ్మొద్దు.. అధికారిక హెచ్చరికలే పాటించాలి...

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 3:29 PMకి 4,900 వీక్షణలు
'అర్నబ్' తుపాను వేళ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ లక్ష్మీశ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 27 : 'అర్నబ్' తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. తుపాను ప్రభావంతో బలమైన పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా తుపాను సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రజల ప్రాణభద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం చేసినప్పుడు ప్రజలు వెంటనే స్పందించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే అధికారుల సూచనల మేరకు సమీపంలోని తుపాను రక్షణ కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు. తుపాను సమయంలో నదులు, వాగులు, వంకల వైపు వెళ్లరాదని హెచ్చరించారు. పెనుగాలులు, భారీ వర్షాల సమయంలో అనవసర ప్రయాణాలు చేయకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే అనధికారిక సమాచారాన్ని నమ్మవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. తుపాను తీవ్రత, ప్రభావం, సహాయక చర్యలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు జారీ చేసే హెచ్చరికలు, సూచనలను మాత్రమే అనుసరించాలని కోరారు. వదంతుల కారణంగా ప్రజలు అనవసర ఆందోళనకు గురికావద్దని సూచించారు. జిల్లాలో తుపాను సంబంధిత అత్యవసర సమాచారం, సహాయం కోసం ఎన్టీఆర్ జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454ను సంప్రదించాలని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ

2 గంటల క్రితం 3,681

'అర్నబ్' తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు!

2 గంటల క్రితం 4,556

కూటమి అభివృద్ధిని.. ప్రతిపక్ష రాజకీయాలను ప్రజలు గుర్తించాలి!

2 గంటల క్రితం 4,857

నున్నలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు!

2 గంటల క్రితం 4,331