ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సుందరయ్య నగర్‌కు కొత్త రోడ్ల వెలుగు

నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బొండా ఉమా శంకుస్థాపన డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపుతూ రహదారుల నిర్మాణం సెంట్రల్‌లో రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 2:52 PMకి 2,371 వీక్షణలు
సుందరయ్య నగర్‌కు కొత్త రోడ్ల వెలుగు — చిత్రం 1
సుందరయ్య నగర్‌కు కొత్త రోడ్ల వెలుగు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 26 : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం 63వ డివిజన్ సుందరయ్య నగర్‌లోని రామాలయం పక్క వీధిలో నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక మహిళలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సుందరయ్య నగర్‌లోని నాలుగు వీధుల్లో దీర్ఘకాలంగా డ్రైనేజీ సమస్య ఉందన్నారు. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానిక మహిళలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టి, ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను

సుందరయ్య నగర్‌కు కొత్త రోడ్ల వెలుగు — అదనపు చిత్రం 2

ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలు కురిసిన సమయంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల పరిస్థితిని పరిశీలించామని చెప్పారు. గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టేలా కృషి చేసినట్లు వివరించారు. గత 26 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు రూ.6.50 కోట్లతో రోడ్లు, కల్వర్టులు, తాగునీటి సదుపాయాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పదవులు, హోదాల కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని, రాబోయే రోజుల్లో మరింత అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, మోత్కూరి కాసిం, షేక్ మెహర్, దుర్గాసి రాము, భీమన ఆంజనేయులు, మోదుగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086