అన్నప్రసాదంలో నాణ్యతకు పెద్దపీట
దుర్గగుడి అన్నదాన విభాగంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ వంటశాల పరిశుభ్రత భోజన నాణ్యతపై క్షుణ్ణంగా పరిశీలన దసరాకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లకు ఆదేశం

విజయవాడ, సెప్టెంబర్ 26 : ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని అన్నదాన విభాగాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నప్రసాదం తయారీ విధానం, వంటశాలలో శుచి, శుభ్రతతోపాటు భక్తులకు వడ్డిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అన్నదాన ప్రాంగణంలో తాగునీరు, భక్తులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్‌కు సూచించారు. వంటశాల, భోజనశాలల్లో పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, అన్నప్రసాదం నాణ్యత విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

