లాటరీ ద్వారా 21 మద్యం దుకాణాల కేటాయింపు
కృష్ణా జిల్లాలో 35 దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం… 22 దుకాణాలకు వచ్చిన 111 దరఖాస్తులు… దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ నిర్వహించిన అధికారులు…

మచిలీపట్నం, అక్టోబర్ 8: నూతన మద్యం విధానంలో భాగంగా కృష్ణా జిల్లాలో 21 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించారు. మచిలీపట్నంలో దరఖాస్తుదారుల సమక్షంలో సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లావణ్య ఈ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 35 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, 22 దుకాణాలకు 111 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 21 దుకాణాలకు అధికారులు లాటరీ నిర్వహించారు. లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారులకు దుకాణాలను కేటాయించి లైసెన్సులు మంజూరు చేశారు.

