ఆటోనగర్‌లో నెత్తుటి రాత్రి.. రాయితో మోది వ్యక్తి హత్య
గుర్తుతెలియని వ్యక్తిని రాయితో మోది హత్య... నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఘటన... నిందితుడి కోసం పోలీసుల గాలింపు...

విజయవాడ, సెప్టెంబర్ 29: విజయవాడ ఆటోనగర్‌లో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తిని ఓ దుండగుడు రాయితో తలపై బలంగా మోది హతమార్చాడు. తీవ్ర గాయాల కారణంగా బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలను గుర్తించడంతోపాటు హత్యకు దారితీసిన కారణాలు, నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాల్లోని నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

