వీరభద్రాచారికి ఘన సత్కారం
ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్ష నూతన అధ్యక్షుడిని అభినందించిన తోలేటి శ్రీకాంత్ అస్వస్థతకు గురైన గౌతమ్‌రెడ్డికి పరామర్శ

విజయవాడ, సెప్టెంబర్ 22 : విజయవాడ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సున్నపు వీరభద్రాచారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ అభినందించారు. గాంధీనగర్‌లోని గౌరీశంకర్ ఫంక్షన్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వీరభద్రాచారిని పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేస్తూ ఫొటోగ్రాఫర్ల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శ్రీకాంత్ ఆకాంక్షించారు. అనంతరం ఇటీవల డీఎస్సీ నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల లాఠీచార్జిలో అస్వస్థతకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డిని విజయవాడలోని ఆయన నివాసంలో శ్రీకాంత్ కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

