ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ22, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్!

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల తదుపరి ప్రక్రియ నిలిపివేత… 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలపై ప్రభావం… నామినేషన్ల గడువు పొడిగింపుపై నేడే ఎస్‌ఈసీ నిర్ణయం…

V10TV న్యూస్ డెస్క్ 22 అక్టోబర్, 2026 8:28 AMకి 4,901 వీక్షణలు
100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, అక్టోబర్ 22: రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల తదుపరి ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ల దాఖలు సమయంలో తమ అభ్యర్థులను అడ్డుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఫిర్యాదులు, వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తొలుత 19 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రధానంగా ప్రస్తావనకు రాగా, అనంతరం ఎస్‌ఈసీ మొత్తం 100 సంస్థల్లో తదుపరి ఎన్నికల ప్రక్రియను నిలిపివేసింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలా వద్దా అనే అంశంపై గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీల నుంచి నివేదికలు కోరారు. నామినేషన్ల గడువు పొడిగించాలని నిర్ణయిస్తే కనీసం 48 గంటల అదనపు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. తుది పోటీ అభ్యర్థుల జాబితా ప్రచురణ కూడా వాయిదా పడింది. అక్టోబర్ 25 వరకు జాబితా ప్రచురణను నిలిపివేయాలని ఎస్‌ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అక్టోబర్ 27న జరగనుంది. అప్పటివరకు ఎన్నికల తదుపరి ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన స్కార్పియో నలుగురు దుర్మరణం

16 నిమిషాల క్రితం 3,599

తుది అభ్యర్థుల జాబితా ప్రచురణ వాయిదా

11 గంటల క్రితం 3,660

భవానీల రద్దీపై డ్రోన్ నిఘా!

13 గంటల క్రితం 4,602

బెజవాడలో తొలి ఏకగ్రీవం టీడీపీ ఖాతాలో!

14 గంటల క్రితం 3,435