ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ21, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

భవానీల రద్దీపై డ్రోన్ నిఘా!

దుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివస్తున్న భవానీ దీక్షాధారులు… ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల ప్రత్యేక కార్యాచరణ… డ్రోన్ కెమెరాలతో రద్దీ పర్యవేక్షణ.. పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి…

V10TV న్యూస్ డెస్క్ 21 అక్టోబర్, 2026 8:59 PMకి 4,601 వీక్షణలు
భవానీల రద్దీపై డ్రోన్ నిఘా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 21: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి భవానీ దీక్షాధారులు భారీ సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో భక్తులు వస్తుండటంతో ప్రధాన రహదారులు, కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీనా బేగం పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, బస్సుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన చోట వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. భవానీ దీక్షాధారులను తీసుకువచ్చే బస్సులను నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చర్యలు చేపడుతున్నారు. ప్రధాన రహదారులపై వాహనాలు నిలపకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ పెరిగితే ప్రత్యామ్నాయ స్థలాలకు వాహనాలను మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని, నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాహనాలను నిలపాలని డీసీపీ షరీనా బేగం సూచించారు. అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా సహకరించాలని కోరారు. భక్తుల సౌకర్యం, ప్రజల భద్రత, సాఫీగా ట్రాఫిక్ నిర్వహణే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడలో తొలి ఏకగ్రీవం టీడీపీ ఖాతాలో!

2 గంటల క్రితం 3,432

మచిలీపట్నంలో ముక్కలుగా మృతదేహం!

2 గంటల క్రితం 3,549

82వ డివిజన్‌లో కూటమి ప్రచార జోరు

2 గంటల క్రితం 4,860

సెంట్రల్‌లో కూటమి క్లీన్‌స్వీప్ ఖాయం!

3 గంటల క్రితం 5,841