ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సెంట్రల్‌లో 10 సీట్లు కోరిన జనసేన!

బొండా ఉమాతో సామినేని ఉదయభాను భేటీ… స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కీలక చర్చలు… 29 కార్పొరేటర్ స్థానాల్లో కూటమి విజయమే లక్ష్యమన్న బొండా ఉమా…

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 12:39 PMకి 2,787 వీక్షణలు
సెంట్రల్‌లో 10 సీట్లు కోరిన జనసేన! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 10: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు ఊపందుకున్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలోని 29 కార్పొరేటర్ స్థానాల్లో జనసేనకు 10 స్థానాలు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరినట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. శనివారం సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు, మాజీ మంత్రి సామినేని ఉదయభాను ఎమ్మెల్యే బొండా ఉమాతో సమావేశమయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, కూటమి పార్టీల మధ్య సమన్వయంపై చర్చించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మిత్రధర్మాన్ని పాటిస్తూ స్నేహపూర్వకంగా సీట్ల పంపకాలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సీట్లకేటాయింపులు ఎలా ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థుల విజయమే ప్రధాన లక్ష్యమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని మొత్తం 29 స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సమష్టిగా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్నారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయవాడ నగరపాలక సంస్థపై కూటమి జెండా ఎగురవేయాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086