ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

తుఫాన్ వేళ రంగంలోకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము!

స్వయంగా కారు నడుపుతూ గుడివాడ పట్టణంలో విస్తృత పర్యటన... రోడ్లపై కూలిన చెట్లలో 80 శాతానికి పైగా తొలగింపు పూర్తి... విద్యుత్ పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 11:03 AMకి 4,264 వీక్షణలు
తుఫాన్ వేళ రంగంలోకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడివాడ, అక్టోబర్ 28 : 'అర్నాబ్' తుఫాన్ ప్రభావంతో గుడివాడ పట్టణం, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. స్వయంగా కారు నడుపుకుంటూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. తొలుత నందివాడ రూరల్, గుడివాడ పట్టణం, గుడ్లవల్లేరు మండలాల కూటమి నాయకులతో టెలిఫోన్ గ్రూప్ కాల్ నిర్వహించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు, విద్యుత్ అంతరాయాలు, రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని పార్టీ నాయకులకు సూచించారు. అనంతరం గుడివాడ పట్టణంలోని ఏలూరు రోడ్డు, బస్టాండ్, మార్కెట్ సెంటర్, జైన్ స్ట్రీట్, ఆర్డీవో కార్యాలయ రోడ్డు, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. లింగవరం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ప్రధాన విద్యుత్ లైన్ మరమ్మతు పనులను సమీక్షించి పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో కూలిన చెట్లలో 80 శాతానికి పైగా ఇప్పటికే తొలగించినట్లు తెలిపారు. మున్సిపల్ యంత్రాంగం వేగంగా స్పందిస్తూ రహదారులను అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సంబంధిత సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా బలమైన ఈదురుగాలులు వీస్తున్న సమయంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణాలు చేయవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. సాయంత్రం వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కూటమి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, చెట్లు కూలడం, విద్యుత్ అంతరాయాలు వంటి సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి లేదా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అవసరమైన చోట తక్షణ సహాయక చర్యలు చేపడతామని వెనిగండ్ల రాము తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అర్నబ్ తుఫాను బీభత్సం.. వాడపల్లి ఆలయంలో నష్టం!

3 నిమిషాల క్రితం 0

తుఫాను వేళ రోడ్లపైకి ఎస్పీ.. సహాయక చర్యలపై ప్రత్యేక నిఘా!

9 నిమిషాల క్రితం 3,865

తుఫాన్ వర్షాల్లోనూ రోడ్లపైనే ట్రాఫిక్ పోలీసులు!

1 గంట క్రితం 2

తుఫాన్ ముప్పు.. కొండ ప్రాంతాల్లో పోలీసుల అప్రమత్తం!

1 గంట క్రితం 4,176