ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

తుఫాన్ వర్షాల్లోనూ రోడ్లపైనే ట్రాఫిక్ పోలీసులు!

విజయవాడలో అప్రమత్తమైన ట్రాఫిక్, వీఎంసీ యంత్రాంగం... డీసీపీ షరీన్ బేగం ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు... రోడ్లపై నీటి నిల్వల తొలగింపు.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 11:13 AMకి 2 వీక్షణలు
తుఫాన్ వర్షాల్లోనూ రోడ్లపైనే ట్రాఫిక్ పోలీసులు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 28 : 'అర్నబ్' తుఫాన్ ప్రభావంతో విజయవాడ నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు, విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులు, కూడళ్లలో నీరు నిల్వ ఉండకుండా, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వర్షాలను సైతం లెక్కచేయకుండా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఏసీపీల పర్యవేక్షణలో నగరవ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నీటి నిల్వలను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రధాన కూడళ్లు, రద్దీ రహదారుల్లో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడకుండా అవసరమైన సూచనలు అందిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే పరిస్థితులను గుర్తించి వీఎంసీ సిబ్బందితో కలిసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం వాహనదారులకు పలు సూచనలు చేశారు. వర్షాల సమయంలో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనచోదకులు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. రహదారులపై నీరు నిలిచిన ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు, వీఎంసీ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని, వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనదారులు అనవసర ప్రయాణాలను నివారించి సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అర్నబ్ తుఫాను బీభత్సం.. వాడపల్లి ఆలయంలో నష్టం!

2 నిమిషాల క్రితం 0

తుఫాను వేళ రోడ్లపైకి ఎస్పీ.. సహాయక చర్యలపై ప్రత్యేక నిఘా!

8 నిమిషాల క్రితం 3,865

తుఫాన్ ముప్పు.. కొండ ప్రాంతాల్లో పోలీసుల అప్రమత్తం!

1 గంట క్రితం 4,176

తుఫాన్ వేళ రంగంలోకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము!

2 గంటల క్రితం 4,264