దుర్గమ్మ భక్తులకు పాల పంపిణీ
దేవస్థానం ఆధ్వర్యంలో పాల పంపిణీ… హెల్పింగ్ హాండ్స్ ద్వారా భక్తులకు అందజేత… ఉత్సవాల తొలిరోజు నుంచి కొనసాగుతున్న సేవలు…

విజయవాడ, అక్టోబర్ 17: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో క్యూలైన్లలో పాలు పంపిణీ చేస్తున్నారు. ఘాట్ రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకునే భక్తులకు హెల్పింగ్ హాండ్స్ సేవకులు పాలు అందజేస్తున్నారు. ఉత్సవాల తొలిరోజు నుంచి ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. భక్తులకు అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా క్యూలైన్లలో వచ్చే భక్తులకు పాలు అందేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. హెల్పింగ్ హాండ్స్ సేవకులు పంపిణీ కార్యక్రమంలో సేవలందిస్తున్నారు.

