ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేసింది టీడీపీనే

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యానికి కట్టుబడి ఉన్నాం… బీసీ రిజర్వేషన్లకు వైసీపీ అడ్డంకులు సృష్టించింది… బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం: నాగుల్ మీరా

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 2:02 PMకి 3,484 వీక్షణలు
బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేసింది టీడీపీనే — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 10: బీసీలకు రాజకీయంగా గుర్తింపు, గౌరవం, ఉన్నత పదవులు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని టీడీపీ నాయకుడు నాగుల్ మీరా అన్నారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు మొదటి నుంచి టీడీపీకి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చట్టపరమైన రిజర్వేషన్ల అంశంతో పాటు పార్టీ పరంగా బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే నిర్ణయం వారి రాజకీయ సాధికారతకు దోహదపడుతుందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా వైసీపీ న్యాయపరమైన అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి, నిధులను సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జరిగిన అన్యాయానికి 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. బీసీల హక్కుల పరిరక్షణ, రాజకీయ ప్రాతినిధ్యం పెంపునకు టీడీపీ నిరంతరం కృషి చేస్తుందని నాగుల్ మీరా పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086